Friday, November 22, 2024

ఆందోళన కలిగిస్తున్న ఆర్యవైశ్యుల మరణాలు..

ఎల్లారెడ్డిపేట: కరోనా తీవ్రతతో గొల్లపల్లి, బొప్పాపూర్‌లలో ఆర్య వైశ్యుల మరణాలు రోజు ఒక్కొక్కరుగా మృతిచెందడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. గత 14 రోజులుగా నలుగురు వైశ్యులు మృతిచెందారు. బొప్పాపూర్‌కు చెందిన చిలువేరు రవీందర్‌ 14 రోజుల క్రితం కరోనాతో హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గొల్లపల్లికి చెందిన కేశెట్టి కమల కరోనాతో కరీంనగర్‌ ఆస్పత్రిలో మరణించింది. మంగళవారం గొల్లపల్లికే చెందిన చేపూరి పోచయ్య సిరిసిల్ల ఆస్పత్రిలో మరణించారు. బుధవారం బొప్పాపూర్‌కు చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు అల్లాడి రాజేశం కరోనాతో కామారెడ్డి ఆస్పత్రిలో మరణించాడు. వరుసగా కరోనాతో రెండు గ్రామాల్లో మరణించిన వారందరి కుటుంబీకులు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం పెనుగొండకు వెళ్లి అమ్మను దర్శించుకొని, అనంతరం మరికొన్ని ప్రదేశాలలో తిరిగి వచ్చిన వారే అధికులు. వారితోనే ఇక్కడ కరోనా ప్రబలి వైశ్యుల వరుస మరణాలకు కారణమైందన్న వాస్తవం అందరిలో తీవ్ర చర్చనీయాంశమైంది. పలువురు వైశ్యులు ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు. వరుసగా మరణిస్తున్న వారి అంత్య క్రియలకు ఎవరూ హాజరు కలేని పరిస్థితితో దయనీయ దుస్థితి నెలకొంది. అందరూ ఉండి, అన్ని ఉన్నా అనాధ శవాలుగా స్మశానానికి అంబులెన్సులో చేరుతున్న మృతదేహాలు పీపీఈ కిట్లు- ధరించిన వారితో చితిలో కాలుతుండటం అందరి కంట కన్నీరు పెట్టిస్తుంది. ఇలా అనేక మందికి, అనేక గ్రామాల వారు, అన్ని కులాల వారు ఎదుర్కొంటు-న్న కడు దుర్భర, దారుణ మరణాలు, మరచిపోని, మరుపురాని అత్యంత విషాదాంత ఉదంతాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement