Friday, November 22, 2024

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి..

వేములవాడ: కరోనాని కట్టడి చేయడంలో కేంద్ర ..రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టిపిసిసి కార్యదర్శి, వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్‌ ఆది శ్రీనివాస్‌ ఆరోపించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా రెండవ దశలో ఎంతో కిష్ట పరిస్థితి ఎదురవుతోందని, ప్రభుత్వాల నిర్లక్ష్యం ధోరణి వల్లే ఇలాంటి దుస్థితి వచ్చిందన్నారు. మొదటి దశ కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అప్రమత్తం కాకపోవడం వల్లే రెండో దశలో కరోనా మరింత తీవ్రరూపం దాల్చిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మరింత ప్రాణనష్టం జరగకముందే ఆసుపత్రులలో బెడ్లు, ఆక్సిజన్‌, మేడి సివర్‌, మందుల కొరతను తీర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రజలను పట్టించుకోకుండా ఎవరి చేతులు వారిపైనే పెట్టడం శోచనీయమన్నారు. కోవిడ్‌ మరణాల సంఖ్య కూడా పెరుగుతుందని, ఈ తరుణంలో నియంత్రణ చర్యలు చేపట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. నిరుపేదలను ఆదుకునేందుకు కరోనా వైద్యాన్ని వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. కరోనా మహమ్మారి నుండి ప్రజలకు భరోసా కల్పించి, ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, కరోనాతో నష్టపోయిన వారి ని గుర్తించి ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement