కరీంనగర్ కు చెందిన మరో కార్పోరేటర్ అరెస్ట్ అయ్యారు. భూదందాల్లో వసూళ్లకు పాల్పడడంతో కేసు నమోదు చేశారు. సీతారాంపూర్ ఏరియా కార్పోరేటర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అనుచరుడు జంగిలి సాగర్ ను అరెస్ట్ చేశామని కరీంనగర్ పోలీసులు తెలిపారు. బాధితుడు లింగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు. మేరకు జంగిలి సాగర్ పై కేసు నమోదు చేశారు. బుధవారం కరీంనగర్ కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కరీంనగర్ కోర్ట్. సాగర్‌ను కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.
ఇటీవల కార్పొరేటర్ తోట రాములు తో పాటు నాయకుడు చీటి రామారావు అరెస్టు కాగా.. బుధవారం సాగర్ అరెస్ట్ కావడం తో బి ఆర్ ఎస్ కార్పొరేటర్ లలో వణుకు మొదలయింది. మరికొందరు భూ కబ్జాదారుల భరతం పట్టేంసుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది . బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి ఆర్ పర్యటనలో ఉన్నారోజే ఆ పార్టీ కార్పొరేటర్ అరెస్ట్ కావాడం విశేషం. కె టి ఆర్ కార్పొరేటర్ లతో సమావేశం అయిన సందర్బంగా అరెస్టు ల అంశాన్ని ఆయన దృష్టికి తెచ్చినట్టు తెలసింది. అరెస్ట్ లకు బయపడవద్దని కె టి ఆర్ ఈ సందర్భంగా అన్నట్టు తెలసింది.