Tuesday, November 26, 2024

KNR: స్వాతంత్రపు పూర్వపు పత్రిక ఆంధ్రప్రభ.. డిజిటల్ రంగంలోనూ విప్లవం.. మంత్రి శ్రీధర్ బాబు

మంథని (ప్రభ న్యూస్) : ఆంధ్రప్రభ దినపత్రిక స్వాతంత్రపు పూర్వపు పత్రిక అని రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు తెలియజేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆంధ్రప్రభ 2024 పెద్దపల్లి జిల్లా క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ… తనకు చిన్ననాటి నుండి ఆంధ్రప్రభ అంటే ఎంతో ఇష్టమని స్వాతంత్రోద్యమంలో కూడా ఆంధ్రప్రభ ఎన్నో కథనాలు రాసిందన్నారు.

1938లో ఆంధ్రప్రభ దినపత్రిక ప్రచురితం ప్రారంభమైందని, దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిజిటల్, వెబ్ విభాగాల ద్వారా కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందజేస్తుందన్నారు. ప్రతిరోజు స్మార్ట్ ఎడిషన్ ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మంథని అర్ సి ఇంఛార్జి కుమార్, టౌన్ రిపోర్టర్ కేసారపు రవి, రూరల్ రిపోర్టర్ రవి తోపాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement