Home తెలంగాణ‌ కరీంనగర్ KNR | ఆంధ్రప్రభ అంటే ఎంతో అభిమానం.. మంత్రి శ్రీధర్ బాబు

KNR | ఆంధ్రప్రభ అంటే ఎంతో అభిమానం.. మంత్రి శ్రీధర్ బాబు

0

మంథని, ఆంధ్రప్రభ : అక్షరమే ఆయుధంగా ప్రచురితమవుతున్న ఆంధ్రప్రభ దినపత్రిక అంటే తనకెంతో అభిమానమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల‌ శ్రీధర్ బాబు తెలియజేశారు. గురువారం ఆంధ్రప్రభ దినపత్రిక 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ… చిన్ననాటి నుండి ఆంధ్రప్రభ చదవడం అలవాటని, స్వాతంత్రం సిద్ధించక ముందు నుండి ఆంధ్రప్రభ తొలి తెలుగు దినపత్రికగా ప్రాచుర్యం పొందిందన్నారు.

ఆంధ్రప్రభ యాజమాన్యం ముత్తా గోపాలకృష్ణ, ముత్తా గౌతంల‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకొని ఆంధ్రప్రభ వెబ్, డిజిటల్ మీడియా రంగంలో దూసుకుపోతుందన్నారు. ప్రతిరోజు సాయంత్రం స్మార్ట్ ఎడిషన్ ద్వారా తాజా వార్తలను ప్రజలకు చేరవేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా మేనేజర్ ముస్త్యాల రవి కిషోర్, మంథని ఆర్సి ఇంచార్జ్ కుమార్, లక్ష్మణ్, విజయ్, రవి, నాగరాజు తో పాటు పలువురు పాల్గొన్నారు.

Exit mobile version