గోదావరిఖని: రామగుండం నగర పాలక సంస్థలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు పోరాటాల చేసి అసువులు బాసిన విద్యార్థి, యువత వీరమరణం పొందిన వారికి ఖనిలో అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ- అధ్యక్షులు మద్దెల దినేష్ నగర కమిషనర్ ఉదయ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో జాతీయ జెండాను ప్రధాన కేంద్రంలో జెండాను ఏర్పాటు- చేయాలన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి ఏడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖనిలో అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు- చేస్తే స్ఫూర్తిదాయకంగా ఉంటు-ందని వివరించారు. ఉద్యమ స్పూర్తిని తెలిపేలా నిర్మాణం జరగాలని కోరారు. నింగినంటేలా 200 అడుగుల జాతీయ పతాకం ఏర్పాటు- చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ- ఉపాధ్యక్షులు సిహెచ్. వివేక్, మాదిరెడ్డి నాగరాజ్, సహాయ కార్యదర్శులు కొమ్మ చందు యాదవ్, మండల శ్రీనివాస్, ఆవుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement