విష జ్వరాలు, వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేములవాడ నియోజకవర్గ బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్మడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. మండలంలోని గంభీర్ పూర్ గ్రామంలో చల్మెడ ఆనంద రావు వైద్య విజ్ఞాన సంస్థలు, జిల్లావికాస తరంగిణి కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు.. ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో 300 పైగా వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచతంగా మందులు అందజేశారు.
35ఏళ్లు పైబడిన వారు ఏడాదికి ఒకసారి పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతినిత్యం మెరుగైన ఆరోగ్యం కోసం నడక, యోగ అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జవాజీ రేవతి గణేష్, వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్ రావు, సర్పంచ్ పోతు సిందుజ రాజశేఖర్, గంభీర్ పూర్ సొసైటీ వైస్ చైర్మన్ శీలం మోహన్ రెడ్డి, రైతు సంఘం నాయకులు గడ్డం భూమా రెడ్డి, మండల అధ్యక్షుడు తండ్రియల సర్పంచ్ గడిల గంగాప్రసద్, ఉట్ పల్లి సర్పంచ్ గజ్జెల స్వామి, బీఅర్ఎస్ పార్టీ నాయకులు కల్వ సత్యనారాయణ, దొప్పల జలెందర్ దేవేందర్, రామాంజనేయులు, భాస్కర్ బీఅర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.