Saturday, November 16, 2024

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం : ఏసీపీ కరుణాకర్ రావు

శాంతి భద్రతల పరిరక్షణే తమ ధ్యేయమని కరీంనగర్ రూరల్ ఏసీపీ తాండ్ర కరుణాకర్ రావు పేర్కొన్నారు. ఆదివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ… సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన కర్ణాకర్ రావుకు సబ్ డివిజన్ పరిధిలోని అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement