కరీంనగర్ (ప్రభ న్యుస్) 150కోట్లతో కరీంనగర్ మెడికల్ కళాశాలలో 100 సీట్లతో తరగతులు నిర్వహించేలా కరీంనగర్ జనరల్ హాస్పిటల్ ని బోధనాస్పత్రిగా అప్ గ్రేడ్ చేస్తూ మెడికల్ కాలేజీతో అటాచ్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. శనివారం ప్రగతిభవన్లో జీవో ప్రతిని ముఖ్య మంత్రి కేసీఆర్ చ మంత్రి గంగుల కమలాకర్ అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆశయ సాధన దిశగా వైద్యారోగ్య శాఖ మరో అడుగు వేసిందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కరీంనగర్ మెడికల్ కాలేజీ ఏర్పాటు, అనుబంధ దవాఖానల అప్‌గ్రేడేషన్ కు పరిపాలన అనుమతులు జారీ చేసిందని, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.