కరీంనగర్ : పదవ తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులు ఆదేశించారు.
గురువారం కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నారాయణ హై స్కూల్ పాఠశాలలోని పరీక్ష కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు, తాగునీటి వసతి సౌకర్యాలు ఉన్నాయా లేదా అని, ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ తో లోకి అనుమతించవద్దని, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఆర్డిఓ ఆనంద్ కుమార్, తహసీల్దార్ సుధాకర్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ తదితరులు పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్
Advertisement
తాజా వార్తలు
Advertisement