Friday, November 22, 2024

శబ్ద కాలుష్యం కలిగిస్తే చర్యలు.. సీపీ సుబ్బారాయుడు

శ‌బ్ద కాలుష్యం క‌లిగిస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు అన్నారు. ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలకు బిగించిన మోడిఫై సైలెన్సర్లను తొలగించి రోడ్ రోలర్ తో ధ్వంసం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ద్విచక్ర వాహనదారులు మోడీఫై సైలెన్సర్లు బిగించి సిద్ధ కాలుష్యంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడంతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు అటువంటి వాహనాలపై కొరడా జులిపించారు. ప్రత్యేక వాహనాల తనిఖీ నిర్వహించి వందకు పైగా మోడీపై సైలెన్సర్లు బిగించిన ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి వాహనాల నుండి సైలెన్సర్ తొలగించి సోమవారం కమిషనరేట్ ఆవరణలో రోడ్ రోలర్ తో ధ్వంసం చేయించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వాహనదారులు మోడీఫై సైలెన్సర్లు బిగించి శబ్ద కాలుష్యం చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పలుమార్లు మీడియా ద్వారా విన్నవించినా వాహనదారుల్లో మార్పు లేదని, అందుకే వాహనాలను సీజ్ చేసి మోడీఫై చేసిన సైలెన్సర్లను ధ్వంసం చేశామన్నారు. వాహనదారులు వాహనాలతో వచ్చిన సైలెన్సర్లను తీసుకువచ్చి వారి వాహనాలకు బిగిస్తే వాహనాలు విడుదల చేస్తామన్నారు. ఈ అంశంపై జిల్లా కేంద్రంలోని మెకానిక్ లతో సమావేశం నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లో మాడిఫై చేసిన సైలెన్సర్లను ద్విచక్ర వాహనాలకు బిగించరాదని, అలా చేస్తే మోటార్ వాహనాల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ చంద్రమోహన్, ట్రాఫిక్ ఏసిపి విజయ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement