Monday, June 24, 2024

TS: ఏసీపీ.. భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు..

.. డబ్బులు ఎగ్గొట్టాడు
… మందు డబ్బాతో టేకుమట్లలో నిరసన

టేకుమట్ల, ఆంధ్రప్రభ : డబ్బులు ఇవ్వకుండా తమ భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని పోలీస్ అధికారినని బెదిరిస్తూ తమకు డబ్బులు ఇవ్వడం లేదని బాధిత కుటుంబం మందు డబ్బాతో నిరసనకు దిగిన సంఘటన భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా టేకుమట్ల మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన ఇటుకల రాయమల్లు కుటుంబం మాట్లాడుతూ… తమకు చెందిన 39 గంటల వ్యవసాయ భూమిని పెద్దపల్లి ఏసీపీ గా పనిచేస్తున్న గజ్జి కృష్ణ తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడన్నారు. కానీ రిజిస్ట్రేషన్ సమయంలో 7 లక్షల రూపాయలు చూపించి ఇంటి వద్ద ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెళ్లిపోయాడన్నారు. పోలీస్ అధికారినని బెదిరిస్తూ తన భూమి డబ్బులు ఇవ్వడం లేదని వాపోయారు. ఎస్ఐ, సీఐ, ఎమ్మెల్యే లను కలిసి విన్నవించినా తనకు న్యాయం జరగడం లేదని గత్యంతరం లేక ధర్నా చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement