కరీంనగర్: మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. మత్స్యకారుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు జిల్లా మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎండీ ఖదీర్ అహ్మద్ పట్టుబడ్డాడు. సొసైటీ అనుమతి కోసం మత్స్యకారుడు నర్సయ్య జిల్లా జిల్లా మత్స్య శాఖ అధికారిని సంప్రదించాడు. దీంతో సొసైటీ అనుమతి కోసం నర్సయ్య నుంచి జిల్లా మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ లంచం డిమాండ్ చేశాడు. దీనిపై ఏసీబీ అధికారులను నర్సయ్య సంప్రదించాడు. నర్సయ్య నుంచి 40 వేలను లంచం తీసుకుంటూ ఉండగా డిప్యూటీ డైరెక్టర్ ఖదీర్ అహ్మద్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement