Saturday, November 23, 2024

అగ్నిపథ్ ను రద్దు చేయాలని – మోడీ దిష్టిబొమ్మ దహనం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ను రద్దు చేయాలని దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించాలని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శులు రజినీకాంత్ తిరుపతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని
తెలంగాణ చౌక్లో కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం శనిగరపు రజనీకాంత్,గుగులోత్ తిరుపతి మాట్లాడుతూ.. సైన్యంలోకి కాంట్రాక్ట్ సైనికులను ప్రవేశపెట్టే అగ్నిపత్ పథకాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశ సార్వభౌమాధికారం .. సైన్యాన్ని ఆశించే వారి ప్రయోజనాలను పరిరక్షించడం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని గతంలో జరిగిన విధంగానే రిక్రూమెంట్ నిర్వహించాలని వారు అన్నారు. నాలుగేళ్ల కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిలో సైనికుల రిక్రూట్మెంట్ ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెన్షన్ డబ్బు ఆదా చేసుకోవడం కోసం కేంద్రం కుయుక్తులు చేస్తుందని వారు అన్నారు. తక్షణమే అగ్నిపత్ రద్దుచేసి రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేపట్టాలని కోరారు.

శాంతియుతంగా ఆర్ ఆర్ బి పరీక్షలు నిర్వహించాలి అగ్నిపత్ ను రద్దు చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యువత పై లాఠీఛార్జ్ చేసి తుపాకులతో కాల్చడం దేశంలో మోడీ పాలన ఎలా ఉందో అర్థం అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో గత సంవత్సరం 2021 మార్చి 5న అఖిల్ పేట లో ఆర్మీ ర్యాలీ నిర్వహించి 15 నెలలు గడుస్తున్నా వారికి ఆర్మీ రాతపూర్వక పరీక్ష నిర్వహించకపోవడం వల్ల యువత నిరాశకు గురవుతున్నారు.. ఈ స్కీం వల్ల నష్టపోయే పరిస్థితి కనిపిస్తోందని మండిపడ్డారు.. కేంద్ర ప్రభుత్వం పాత పద్ధతులే శాశ్వత ప్రతిపాదన మీద ఆర్మీ ప్రక్రియ చేపట్టాలని అన్నారు, అగ్నిపత్ రద్దు చేయాలని పోరాటం చేస్తున్న యువతకు ఆందోళనలో సికింద్రాబాద్ లో చనిపోయిన వారి కోటి రూపాయలు ఎక్గ్రేషియా ఇవ్వాలి, గాయాలైన వారికి కేంద్ర ప్రభుత్వం నాణ్యమైన వైద్యం అందించాలని హెచ్చరించారు, ఇప్పటికైనా ప్రజాస్వామిక వాదులు మేధావులు అగ్నిపత్ ను రద్దు చేయాలని ఖండించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గజ్జల శ్రీకాంత్ డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి నగవత్ శీను నాయక్ అజయ్ ఎస్ఎఫ్ఐ నాయకులు రోహిత్,సాయి,వినయ్,సంతోష్,మహేష్,రాకేష్ ఇతరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement