…కాంగ్రెస్ శ్రేణుల భారీ సన్మానం
సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వెళుతున్న ఉప ముఖ్యమంత్రిని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక తెలంగాణ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద ఘన స్వాగతం పలికారు.
పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకొని బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లకు పుష్పగుచ్చాలు, గజమాలలు వేసి స్వాగతం పలికిన అనంతరం శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కాన్వాయ్ రామగుండం వైపు సాగిపోయింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మినుపాల ప్రకాష్ రావు, అంతటి అన్నయ్య గౌడ్, గోపగాని సారయ్య గౌడ్, దన్ నాయక్ దామోదర్ రావు, చిలుక సతీష్, అప్పయ్య గౌడ్, కల్లేపల్లి జానీ, పొన్నం చంద్రయ్య గౌడ్, సంతోష్ రావు, అంతటి పుష్పలత, ముత్యాల రవీందర్, కుమార్ కిషోర్, గుండేటి అయిలయ్య యాదవ్, దున్నపోతుల రాజయ్య, ఎండీ రఫీక్, మండలంలోని తాజా మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పలువురు పాల్గొన్నారు.