Saturday, November 23, 2024

అక్క‌డో దొంగ.. ఇక్క‌డో దొంగ.. దేశాన్ని స‌ర్వ‌నాశనం చేస్తున్నారు: జీవన్​ రెడ్డి

ప్ర‌తిపక్షాలను బలహీనపరిస్తే తాము బలపడతామ‌ని భావించిన సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ.. త్వ‌ర‌లోనే దాని పర్యావసనాలను చూడాల్సి ఉంటుంద‌ని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేంద్రంలో ఒక దొంగ, రాష్ట్రంలో మరో దొంగ కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో కేసీఆర్ అంత అవినీతి, అసమర్థ ముఖ్యమంత్రి ఎవరూ లేర‌ని కామెంట్ చేశారు. సీఎం కేసీఆర్ 2014లోనే రాష్ట్రంలో ఏక్నాథ్ షిండేను సృష్టించుకున్నారని.. ప్రతిపక్ష ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చారని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇప్ప‌టిదాకా కుర్చీనే దొర‌క‌డం లేదా?
ఎన్నికల ముందు కుర్చీ వేసుకుని పోడు భూముల సమస్య తీరుస్తానన్న సీఎం కేసీఆర్కు ఇప్పటి దాకా కుర్చీనే దొరకడం లేదా అని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ప్రశ్నించారు. గిరిజనులకు హామీ ఇచ్చిన మేరకు రిజర్వేషన్లు కల్పించకుండా వారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా.. అన్యాయంగా గిరిజనుల నుంచి భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూములు ఎక్కడికిపోయాయని నిలదీశారు. జాతీయ పార్టీ పెడతా, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా అంటూ ఊకదంపుడు మాటలు మానేసి.. రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలని సీఎం కేసీఆర్కు ఆయ‌న హిత‌వుప‌లికారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement