పెద్దపల్లి, రూరల్ : పెద్దపల్లి జిల్లా రంగాపూర్‌లో (శుక్రవారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పెద్దపల్లి ట్రాన్స్‌కోకు చెందిన బోలోరోను బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, పెద్దపల్లి మండలం అప్పన్నపేట్ గ్రామానికి చెందిన మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రుడిని పెదపడల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న బసంత్ నగర్ ఎస్సై స్వామి ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.