కరీంనగర్ వాసులకు ఇచ్చిన మాట మేరకు… త్వరలోనే 24 గంటల తాగునీటి సరఫరాను ప్రయోగాత్మాకంగా చేపడుతామని బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈరోజు 21వ డివిజన్ సీతారాంపూర్ లో 14, 15 ఆర్ధిక సంఘ నిధులు రూ.1కోటి 70 లక్షలతో మంచి నీటి పైపు లైన్, రూ.20 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… కరీంనగర్ వాసులకు మెరుగైన సౌకర్యాలు అందించి… సుపరిపాలన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం కరీంనగర్ ను సుందరనగరంగా తీర్చిదిద్ది… భవిష్యత్ తరాలకు అందిస్తామని పునరుద్ఘాటించారు. పనులను నాణ్యతాయుతంగా చేపట్టి… త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను… కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
పైప్ లైన్ నిర్మాణంతో ఈ ప్రాంత వాసులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా పోతాయన్నారు. ఇప్పటికే నగర వాసులకు ప్రతి రోజు తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. కరీంనగర్ వాసులకు ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే 24 గంటల పాటు తాగునీటిని సరఫరాల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం త్వరలోనే ప్రయోగాత్మకంగా చేపట్టనున్నామన్నారు. 24 గంటల నీటి సరఫరా చేస్తే… ప్రజలు అవసరమున్నంత మేరకే నీటిని వాడుకుంటారని… దీంతో నీటి వృధా తగ్గే అవకాశముందన్నారు. గత 67 నుంచి 70 సంవత్సరాలుగా కరీంనగర్ ను గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదని, దీంతో కరీంనగర్ లోని రోడ్లు అభివృద్దికి ఆమడదూరంలో నిలిచాయన్నారు. కానీ… తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… నగరంలో మట్టి రోడ్డు అనేది కనిపించకుండా… అంతర్గత… ప్రధాన రహాదారులను నిర్మిస్తున్నామన్నారు. కరీంనగర్ ను సుందరనగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని… భవిష్యత్ తరాలకు గొప్పనగరాన్ని అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ నగరం మనదని… మన నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందన్నారు.. నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించి… సుపరిపాలన అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి – హరిశంకర్ కార్పొరేటర్లు జంగిలి సాగర్, సూదగోని మాధవి- కృష్ణ గౌడ్, భూమ గౌడ్, తుల రాజేశ్వరి – బాలయ్య కళ్యాణి -శ్రీనివాస్, గందె మాధవి -మహేష్ బోనాల శ్రీకాంత్ తదితరులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..