Friday, November 22, 2024

సింగరేణిలో ఉద్యోగ నోటిఫికేషన్

చాలా రోజుల త‌రువాత సింగ‌రేణిలో ఉద్యోగుల భ‌ర్తీకి నొటిఫికేష‌న్ వ‌చ్చింది. సింగ‌రేణిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి సింగరేణి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ పోస్టులకు డిగ్రీ లేదా డిప్లొమా చేసినవారు అర్హులు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 177 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఈ ఉద్యోగాలను ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన అభ్యర్థులతో భర్తీ చేస్తారు.

ఖాళీగా మొత్తం 177 పోస్టులు ఉన్నాయి. దీనికి అర్హులు కావాలంటే డిగ్రీలో కంప్యూటర్స్‌లో లేదా డిప్లొమా చేసి ఉండాలి. అభ్యర్థులు 30 ఏండ్లలోపు వారై ఉండాలి. రాత ప‌రీక్ష ద్వారా వీరికి ఎంపిక చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ మొత్తం ఆన్ లోనే జ‌రుగుతుంది. ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకునేవారికి చివ‌రి తేదీ జూన్ 10 గా అధికారులు నిర్దారించారు. దీనికి సంబంధించిన వెడ్ సైట్ https://scclmines.com/ ఓపెన్ చేసిన ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సంబంధిత అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement