పురిటినొప్పులతో ఉన్న గర్భిణిని దవాఖానకు తరలిస్తుండగా, 108 వాహనంలోనే ప్రసవించింది. 108 సిబ్బంది ఆమెకు ప్రసవం చేసి.. తల్లీ, బిడ్డలను కాపాడారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలంలో జరిగింది. బొమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రత్యూష నిండుగర్భిణి. పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యలు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది ఈఎంటీ మోతె కనకయ్య, పైలెట్ పీ అఖిల్ అంబులెన్స్‌లో ప్రత్యూషను దవాఖానకు తరలిస్తుండగా పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్స్‌ను రోడ్డు పక్కన ఆపి ఆమెకు సిబ్బంది ప్రసవం చేశారు. తల్లీ, బిడ్డను కాపాడారు. ప్రత్యూష పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా, 108 సిబ్బందికి ప్రత్యూష కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement