Saturday, November 23, 2024

కల్యాణలక్ష్మితో 10.56 లక్షల మందికి లబ్ధి : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

క‌ల్యాణ‌ల‌క్ష్మితో 10.56ల‌క్ష‌ల మందికి ల‌బ్ది చేకూరుతుంద‌ని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లి తల్లిదండ్రులకు భారం కావద్దని దేశంలోనే మొదటిసారిగా 2014 లో విప్లవాత్మక పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద ఇప్పటివరకు 10,56,239 మంది లబ్ధిదారులకు 1,00,116 రూపాయల చొప్పున పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన కల్యాణ లక్ష్మీ పథకంతో ఇప్పటి వరకు 10 లక్షల కుటుంబాలకు ఆసరాగా నిలిచిన సీఎం కేసీఆర్ కు ఆడపిల్లల తల్లిదండ్రుల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి, వైస్ చైర్ పర్సన్ నజ్మీన్ సుల్తానా-మోబిన్, పట్టణాధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, కౌన్సిలర్ లు ఎరుకాల కల్పన-రమేష్, గాదె మాధవి, పుదరి చంద్రశేఖర్, పైడ పద్మ-రవి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వెన్నం రవి, నాగరాజు, మెప్మా అర్ పి లు, వార్డుల్లోని మహిళా అధ్యక్షురాలు, మహిళలు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement