పెద్దపల్లి రూరల్: ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు ప్రకటించిన పీఆర్‌సీ ఫిట్మెంట్ హర్షనీయమని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం, తెలంగాణ బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ,మైనారిటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అద్యక్షుడు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. ఎన్నికల కోడ్ అనంతరం ఉపాధ్యాయ ఉద్యోగులకు 29 శాతం ఫిట్మెంట్ అందిస్తామని ప్రకటించారని, ఇది ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఎంతో ఆనందకరమైన విషయమన్నారు. త్వరలోనే పదవీ విరమణ చేయబోతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్‌సీ ఫిట్మెంట్ వర్తించడం వల్ల అనేక లాభాలు పొందుతారని తెలిపారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ ఫిట్మెంట్‌ను స్వాగతిస్తున్నారని తెలిపారు. పదవీ విరమణ వయస్సు 58 నుంచి 61 వరకు పెంచుతామని తెలపడం ఉపాధ్యాయ, ఉద్యోగులకు తీపి కబురేనని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి కేసీఆర్ వెంట నడిచిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు నాడు ఇచ్చిన హామీలను నేడు అమలు చేసే దిశగా సీఎం కృషి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
–
సీఎం ప్రకటన హర్షనీయం..
Advertisement
తాజా వార్తలు
Advertisement