Saturday, November 23, 2024

మౌలిక సదుపాయాల కోసం..

ఇల్లందకుంట: తహసిల్దార్‌ కార్యాలయంలో మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కరీంనగర్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌లాల్‌ పేర్కొన్నారు. ఇల్లందకుంట మండల కేంద్రంలోని తహసిల్దార్‌ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తహసిల్దార్‌ కార్యాలయంలో ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని, కార్యాలయానికి వచ్చే ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో తహసిల్‌ కార్యాలయానికి రూ. 10 లక్షల నిధులను బడ్జెట్‌లో కేటాయించిందన్నారు. కార్యాలయం వాస్తు ప్రకారం ఉండే చూడాలని సూచనలు చేశారు. ప్రజలు ఇబ్బంది పడకుండా మూత్రశాలల సౌకర్యం కల్పించాలని తహసిల్దార్‌ సురేఖకు సూచించారు. ఈకార్యక్రమంలో హుజురాబాద్‌ ఆర్డీవో బెన్‌ షాలోం, తహసిల్దార్‌ సురేఖతోపాటు- రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement