వేములవాడ: వేములవాడ పట్టణంలో రెండో రోజు కాంగ్రెస్ నాయకులను అర్ధరాత్రి 3 గంటలకు అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించడం చూస్తే టిఆర్ఎస్ పార్టీకి తమను చూస్తేనే భయం పట్టుకున్నట్లు అర్ధమవుతుందని వేములవాడ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి పేర్కొన్నారు. పోలీస్స్టేషన్లో ఆయన మాట్లాడుతూ అధికార తెరాస పార్టీ భయంతోనే కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయిస్తుందని, ఈ అరెస్టులు ప్రజాస్వామ్య విరుద్ధమని ఖండించారు. రాబోయే రోజులలో టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టే పరిస్థితి చూస్తారని, ప్రజలు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారన్నారు. అరెస్టయిన వారిలో నాయకులు మోడీకే చంద్రశేఖర్, చిలుక రమేష్, మధు, ఎంపిటిసి రాజశేఖర్, నాగుల విష్ణు, సర్పంచ్ రాజ ప్రకాష్, ప్రశాంత్, ఎర్ర మామయ్య, రాజేష్, రాము, రాజులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement