జూలపల్లి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాహనంపై స్వేరో షాడో టీమ్ దాడి చేయడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు పాటకుల మహేశ్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని, జాతీయ పార్టీ అధ్యక్షుడిపై స్వేరో టీ-మ్ దాడికి దిగడం శోచనీయమన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు కేసులు పెట్టకపోవడం ప్రభుత్వ తీరుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో హిందువులపై దాడులు జరుగుతున్నా ఇతర పార్టీలు కనీసం స్పందించక పోవడం సిగ్గు చేటన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ దళితుల సమస్యలపై పోరాటం చేయాలని, హిందుమతంపై కాదని సూచించారు. ఇలాంటి వారికి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదన్నారు. ఈకార్యక్రమంలో కుసుకుంట్ల మోహన్ రెడ్డి, అరేపెళ్లి మల్లేశం, రాజు శెట్టి, నగునూరి లక్ష్మణ్, పోటాల శ్రీనివాస్, కమ్మంసతీష్, ఒల్లాజి శ్రీనివాస్, కుసుకుంట్ల సతీష్‌రెడ్డి, బోడిగే లక్ష్మణ్, గుడిపాటి అమిత్‌రెడ్డి, బీరయ్య, వినయ్, మహేందర్, మొండయ్య, సంపత్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement