యైటింక్లయిన్‌కాలనీ: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని సీఐటీయూ డివిజన్ కార్యదర్శి ఉల్లి మొగిలి పిలుపునిచ్చారు. ఆర్జీ2 ఏరియా జీడీకే 7ఎల్‌ఈపీ గనిలో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా కార్మికులతో కలిసి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చి, ప్రభుత్వ రంగ సంస్థలను, బొగ్గు పరిశ్రమను, ప్రైవేటికరిస్తూ పెట్టు-బడిదారులకు లాభాలు చేకూరుస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలో ఆందోళన నిర్వహిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సింగరేణిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, వారసులకు ఉద్యోగాలు వస్తున్నప్పటికీ, 1,14,000 ఉన్న కార్మికుల సంఖ్య 40 వేలకు కుదించబడిందన్నారు. హక్కులు హరిస్తూ, డిఎ లెక్కింపులో మోసం చేస్తున్నారన్నారు. గుర్తింపు సంఘం టిబిజికేఎస్ కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదని, పైరవీలకే పరిమితమై పనిచేస్తుందన్నారు. కార్మిక హక్కుల సాధన కోసం సిఐటియు నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, రాజయ్యతోపాటు- కార్మికులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement