Friday, November 22, 2024

ప్రజల విశ్వాసాలను దెబ్బతీస్తే ఊరుకోబోం..

జూలపల్లి: హిందూ ప్రజల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని నాయకులు హెచ్చరించారు. వడ్కాపూర్‌లో బౌద్ధ క్షేత్రంలో హిందూ దేవీ దేవతలను తూలనాడిన ప్రాంతాన్ని గ్రామస్తులతో కలిసి పాలతో శుద్ధి చేశారు. పచ్చనిపల్లెల్లో చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం చేశారు. అక్కడే ఉన్న ఆంజనేయస్వామికి పాలాభిషేకం చేసి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం జై శ్రీరామ్‌, జై భీం నినాదాలు చేశారు. బుద్దుని క్షేత్రం శాంతికి నిలయమని, అలాంటి ప్రాంతంలో అశాంతిని నెలకొల్పేలా, కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా కొంతమంది వ్యక్తులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేవుళ్లపై నమ్మకం లేదని హిందూ సంస్కృతి సాంప్రదాయాలను నమ్మకూడదని ప్రజల చేత ప్రమాణం చేయించడం ప్రజల విశ్వాసాలను దెబ్బ తీయడమేనన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఇతర పార్టీల నేతలు ఈ వ్యాఖ్యలను ఖండించకపోతే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో నాయకులు రేశవేని సతీష్‌, అమరగాని ప్రదీప్‌ కుమార్‌, ఎర్రోళ్ల శ్రీకాంత్‌, వేల్పుల ఓదెలు, కొల్లూరి స్వామి, గుమ్మడి శ్రీనివాస్‌, కనకట్ల నర్సింగం, గుర్రం సంపత్‌, కనకట్ల స్వామి, మల్లేష్‌, రంగు రాజేష్‌, వేల్పుల సతీష్‌, సిలివేరు మధు, నగునూరి అజయ్‌, గంగిపెళ్లి సాగర్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement