కాల్వశ్రీరాంపూర్: మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని పేదలకు పంచాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్ డిమాండ్ చేశారు. ఆయన ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మండలంలో ఆయా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములు వేల ఎకరాలున్నాయన్నారు. మండలంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు లక్షలు పుచ్చుకొని ప్రభుత్వ భూములు భూములు ఉన్నవారి కే పట్టాలు చేశారని ఆరోపించారు. మండల కేంద్రంలోనూ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి రెవెన్యూ అధికారులు కొందరికి ప్రభుత్వ భూములు అక్రమంగా పట్టాలు చేశారన్నారు. మండలంలోని కాల్వ శ్రీరాంపూర్, పందిల్ల, ఎదులాపూర్, పెద్దరాతుపల్లి, కునారం, వెన్నంపల్లి తదితర గ్రామాల్లో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా నిరుపేదలకు పంచాల్సిన భూములను గతంలో ఇక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారులు వ్యవసాయ భూములు ఉన్న వారి దగ్గర ముడుపులు తీసుకుని వారికే భూములను పట్టా చేశారన్నారు. దీంతో దళితులకు నిరుపేదలకు భూములు లేక కూలీలుగానే మిగిలిపోతున్నారని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి ఈ ప్రాంతంలో అక్రమంగా పట్టా చేసుకున్న ప్రభుత్వ భూముల వివరాలు సేకరించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. ప్రభుత్వ భూములు అక్రమంగా పట్టా విషయంపై ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిషనర్ కూడా ఫిర్యాదు చేయనున్నట్లు- తెలిపారు. రామగుండం కమిషనర్ సత్యనారాయణ భూ అక్రమాలు అక్రమంగా అక్రమంగా చేసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామనడం సంతోషకరమన్నారు. జిల్లా అధికారులు కూడా స్పందించి ప్రభుత్వ భూములు అక్రమంగా పట్టా చేసుకున్న వివరాలు సేకరించి ఆ పట్టాలను రద్దు పరిచి నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేశారు. అక్రమంగా భూములు పట్టా చేసిన రెవెన్యూ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చిలుముల రాజు, పాల రాజయ్య, చిలుముల రమేష్, చిలుముల కుమార్, మంథని లక్ష్మయ్య, మల్లయ్య, బెజ్జాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement