Tuesday, September 17, 2024

తైక్వాండోలో విద్యార్థుల ప్రతిభ

యైటింక్లయిన్‌కాలనీ : ఈనెల 14న కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలోని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌లో -టైక్వాండో అసోసియేషన్‌ కరీంనగర్‌ జిల్లా వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి -టైక్వాండో ఛాంపియన్‌ షిప్‌ 2021 పోటీలను నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా -టైక్వాండో అసోసియేషన్‌ తరపున గోదావరిఖని పోతన కాలనీ బాలబాలికలు గని ప్రజ్వల్‌, సాయిస్మరణ్‌, సుశిక్షిత, కేశిక, వెంకట్‌, ప్రణవి, నిహాల్‌, తన్సికలు బహుమతులను కైవసం చేసుకున్నారు. ఈ పోటీలను సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ విభాగాలలో నిర్వహించగా గెలుపొందిన విద్యార్థులకు 8వకాలనీ సిఐ శ్రీనివాస్‌రావు, పెద్దపల్లి జిల్లా -టైక్వాండో అసోసియేషన్‌ అధ్యక్షులు మనోహర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సతీష్‌ కుమార్‌, తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి జి. సంతోష్‌, గోదావరిఖని పట్టణ తైక్వాండో కోచ్‌ కిరణ్‌ కుమార్‌ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement