యైటింక్లయిన్‌కాలనీ: ఆర్జీ2 ఏరియా 8వకాలనీ సెక్టార్3 డిస్పెన్సరీలో ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కల్పించారు. ఎస్‌ఓటు జీఎం సాంబయ్య ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు కిడ్నీల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించేందుకు డిస్పెన్సరీ ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. మంచి ఆహారపు అలవాట్లతో కిడ్నీ వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. సింగరేణి సంస్థ రెండు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉద్యోగులకు హైదరాబాద్‌లాంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే అందుబాటులో ఉంచిందన్నారు. ఎసీఎంఓ డాక్టర్ కిరణ్‌రాజ్ మాట్లాడుతూ ప్రతి ఏటా మార్చి రెండోవారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్‌బాబు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, అధికారులు రాధాకృష్ణారావు, వేణుగోపాల్, ఎర్రన్న, మురళీకృష్ణ, ప్రదీప్‌కుమార్, రాజారెడ్డి, శ్రీరంగారెడ్డి, రాజేశ్వర్, పీవీ రమణ, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement