Sunday, November 3, 2024

గణేష్ కు సన్మానం

కోరుట్లటౌన్‌: యువతలో రక్తదానంపై ఉన్న అపోహలు తొలగించి రక్త దానమంటే ప్రాణదానం చైతన్యం నింపి ఎందరో ప్రాణాలను కాపాడిన సామాజిక వేత్త రక్తదాన సంధాన కర్త కటుకం గణేష్ ని పద్మశాలి మహిళ సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు. పట్టణంలో రక్తదాన అవగాహానపై రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అవార్డులు అందుకున్న గణేష్ను పద్మశాలి మహిళ సంఘ నాయకులు శాలువాలతో పూలమాలలతో సన్మానించారు. మహిళ సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మ ప్రసాదించేది రక్తదానమని, రక్త దానం ప్రాణదానంతో సమానమన్నారు. 12 ఏళ్లుగా పట్టణంలో రక్తదాన ఉద్యమాన్ని కొనసాగిస్తూన్న గణేష్‌ సేవలు ఎంతో గొప్పవన్నారు. గణేష్ ‌ను ఆదర్శంగా తీసుకోని యువత రక్తదానంపై ముందుకు వచ్చి ఆపదలో ఉన్నవారి ప్రాణాలను రక్షించాలన్నారు. ఈకార్యక్రమంలో మార్కెట్‌ చెర్మన్‌ గుడ్ల లక్ష్మి మనోహర్‌, 33వ వార్డ్‌ కౌన్సిలర్‌ రుద్ర సుజాత శ్రీనివాస్‌, మహిళ నాయకులు మచ్చ కవిత, లాయర్‌ చాప వందన, జిల్లా దీపారాణి, పిన్నంశెట్టి జ్యోతిర్మయి, గడ్డం సంజీవరాణి, ఎక్కలదేవి లహరి, కటు-కం నర్మద తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement