Saturday, November 23, 2024

క్రీడాకారులు పోటీతత్వం పెంచుకోవాలి – సీఐ ఇంద్రసేనారెడ్డి

సుల్తానాబాద్‌, : క్రీడాకారులు పోటీతత్వంతో క్రీడల్లో రాణించాలని సుల్తానాబాద్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కందునూరిపల్లి గ్రామంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేరుపై నిర్వహిస్తున్న డీఎంఆర్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఎంపీపీ బాలాజీరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడాకారులకు సుల్తానాబాద్‌ పుట్టినిల్లని, యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల్లో రాణించి మంచి పేరు తేవాలన్నారు. క్రీడలతో దేహదారుఢ్యం పెంపొందడంతోపాటు ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. యువ సన్మార్గంలో పయనించేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. మండల కేంద్రంలో రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీల్లో క్రీడాకారులు చక్కని ప్రతిభ చాటుతున్నారని, గతంలో కేసీఆర్‌ క్రికెట్‌ కప్‌లో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారని, సుల్తానాబాద్‌ మండలంలో గట్టెపల్లి జట్టు రన్నరప్‌గా నిలవగా రూ. 10వేలతో పోలీసుల తరపున క్రికెట్‌ కిట్‌ అందిస్తామన్నారు. యువత క్రీడల్లో రాణిస్తే వారిని ప్రోత్సహిస్తామన్నారు. అనంతరం బ్యాటింగ్‌ చేసి పోటీలు ప్రారంభించారు. నియోజకవర్గంలోని 30 జట్లు పాల్గొంటాయని నిర్వహకులు తెలిపారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ పన్నాల స్వరూప తిరుపతి, ఏఎంసీ చైర్మన్‌ బుర్ర శ్రీనివాస్‌, ఎంపీటీసీ సంపత్‌, మాజీ సర్పంచ్‌ రాజమల్లుతోపాటు నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement