కాల్వశ్రీరాంపూర్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నే మద్దతు ధర లభిస్తుందని ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పిటిసి వంగల తిరుపతి రెడ్డి, సింగిల్విండో చైర్మన్ చదువు రామచంద్ర రెడ్డి లు పేర్కొన్నారు. సోమవారం శ్రీరాంపూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఆశన్నపల్లి, మడిపల్లి, అంకంపల్లి, మడిపల్లి కాలనీలో ఏర్పాటు- చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్ముకొని మోసపోవద్దని సూచించారు. ఈకార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ బూసి సదాశివారెడ్డి, సర్పంచులు మంద రమవెంకన్న, అడిగొప్పుల రాణి మోహన్, ఆకుల చిరంజీవి, తీగల స్వప్న నాగరాజు, నాయకులు, డైరెక్టర్లు, కొట్టే రవీందర్, గొడుగు రాజ కొమురయ్య, జంగా శ్రీనివాసరెడ్డి, కేతిపెళ్లి నరసింహారెడ్డి, కొత్తూరి మొండయ్య, మేకల శ్రీనివాస్, కంచేన చంద్రయ్య, సీఈవో కొల్లేటి శ్రీనివాస్, కేంద్రాల నిర్వాహకులు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement