వేములవాడ: వేములవాడ పట్టణం, అర్బన్, రూరల్ కాంగ్రెస్ నాయకులను తెల్లవారు జామున పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, అర్బన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిల్లి కనకయ్య, రూరల్ అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్‌లు మాట్లాడుతూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్నామని ఉద్దేశంతో పోలీసులు తమను అరెస్ట్ చేయడం సరైంది కాదన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలు చేయిస్తుందని భావిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే సంవత్సరంపాటు- ప్రజలకు అందుబాటు-లో లేకపోవడం వల్ల ప్రజాసమస్యలు కుంటూ పడిపోయాయని, చేతకాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టు వల్ల ఉద్యమాలను ఆపలేరన్నారు. అరెస్టయిన వారిలో కాంగ్రెస్ నాయకులు సంగ స్వామి యాదవ్, కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మోడిగే చంద్రశేఖర్, తుమ్ మధు, భాష రాజశేఖర్, కనికరపు రాకేష్, నాగుల రాముగౌడు, నాగుల విష్ణు ప్రసాద్, కొలకని రాజు, కదిరి రాజ్ కుమార్, రాగుల ప్రశాంత్, ఎర్రం ఆగయ్య, కత్తి కనకయ్య, ముెడే రాజు తదితరులు ఉన్నారు.
ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికం: కాంగ్రెస్ నేత ఆది
వేములవాడ పట్టణ, అర్బన్, రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉదయం పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. బుధవారం తెల్లవారుజామున కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. సమాచారం తెలుసుకున్న ఆది శ్రీనివాస్ వారిని పరామర్శించి సంఘీభావం తెలిపారు.