జూలపల్లి: మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని ఆలయ కమిటీ- ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి వేద పండితుల మంత్రాలతో కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నుల పండువగా కళ్యాణాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా శివ పార్వతులకు సర్పంచ్ దారబోయిన నరసింహం , ఎంపీపీ కుస్కుంట్ల రమాదేవిరాంగోపాల్రెడ్డి, నాయకులు నల్ల మనోహర్ రెడ్డి పట్టు- వస్త్రాలను, మంగళసూత్రాన్ని అందించారు. అనంతరం భక్తులకు రూ. 80 వేల పండ్లు పంపిణీ చేశారు. పాలాభిషేకం, ప్రత్యేక పూజలతోపాటు కల్యాణ మహోత్సవాన్ని అర్చకులు ఉద్దండ నవీన్ వేదమంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించారు. భక్తులు శివపార్వతులకు కట్నకానుకలు సమర్పించి, తీర్థప్రసాదాలు స్వీకరించి వారి కృపకు పాత్రులయ్యారు. అలాగే మండలంలోని వడుకాపూర్ శివాలయం, తేలుకుంట శివాలయాల్లో శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎంపీటీ-సీ అమరగాని మమత ప్రదీప్ కుమార్, ఉపసర్పంచ్ కొప్పుల మహేష్, సింగిల్విండో చైర్మన్ కొంజర్ల వెంకటయ్య, ధూళికట్ట సింగిల్ విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాలరావు, పొట్టాల మల్లేశం, లోక లింగారెడ్డి, రాజలింగం, నాడెం మల్లారెడ్డి, పాఠకుల అనిల్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు, మహిళలు, భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement