Saturday, November 23, 2024

ఎమ్మెల్యే రమేశ్‌బాబు అనర్హుడు

తంగళ్లపల్లి: వేములవాడ ఎమ్యెల్యే చెన్నమనేని రమేష్‌బాబు పౌరసత్వం రద్దు చేసి ఎమ్యెల్యే‌గా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్న వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ ఆది శ్రీనివాస్‌కు మద్దతుగా ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతారన్న సమాచారంతో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జాలగం ప్రవీణ్‌ని తంగళ్ళపల్లి పోలీస్‌లు ముందస్తుగా అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ 12 ఏళ్లుగా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రమేష్‌బాబు భారత రాజ్యాంగాన్ని అవమానపరచి ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ప్రభుత్వ ఫలాలు అనుభవిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, వెంటనే రమేష్‌ బాబు పౌరసత్వం రద్దు చేసి ఎంఎల్‌ఏగా అనర్హుడిగా ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement