కరీంనగర్: ఆలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిందన్నారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ . మహాశివరాత్రి సందర్భంగా వీణవంకలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనానంతరం ఈటల మాట్లాడుతూ మన ప్రాంతంలోని పురాతన ఆలయాలు ఆధ్యాత్మిక జీవనాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తాయని అన్నారు.. మంత్రితోపాటు జెడ్పీ చైర్‌పర్సన్ కనుమల విజయ, సీనియర్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి, పరిపాటి రవీందర్‌రెడ్డి స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement