Friday, November 22, 2024

అంతర్గత అభ్యర్థులతో ఖాళీలు భర్తీ

యైటింక్లయిన్‌కాలనీ: కంపెనీలో వచ్చిన ఖాళీలను అంతర్గత అభ్యర్థులతో నింపాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్‌ చేశారు. ఆర్జీ2 ఏరియా ఓసీపీ3 ఓల్డ్‌ సైట్‌ ఆఫీస్‌ ఏరియాలో ఆర్జీ2 బ్రాంచి ఉపాధ్యక్షుడు అన్నారావు అధ్యక్షతన జరిగిన గేట్‌ మీటింగ్‌లో మాట్లాడుతూ కంపెనీ లాభాలను రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం వల్ల కంపెనీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. గతంలో క్లరికల్‌, ఇంజనీర్‌ ఖాళీలను బయటి వారితో నింపే ప్రయత్నం చేయగా చాలా అవకతవకలు జరిగాయని, లక్షల రూపాయల అవినీతి జరిగిందన్నారు. మెడికల్‌ బోర్డులో తీవ్ర అవినీతి జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో కార్మిక సమస్యలపై జరిగే పోరాటాలలో అందరూ కలిసి రావాలని కోరారు. ఈ సమావేశంలో కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్‌. ప్రకాశ్‌, నాయకులు శ్యాంసన్‌, మహేందర్‌, శంకర్‌, ఆవుల రవికుమార్‌, పండిట్‌ బాబు, మల్లేశ్‌, నర్సింహరావు, రాజిరెడ్డి, వెంకటేశ్‌, కిశోర్‌, కుమార్‌, సాయబ్‌ హుస్సేన్‌, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement