Saturday, June 29, 2024

Karimnagar – కేంద్ర మంత్రి సంజయ్ ఇల్లు ముట్టడి – విద్యార్థుల పై లాఠీచార్జి

కరీంనగర్, ప్రభ న్యూస్ బ్యూరో :కరీంనగర్ లో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర హోం సహాయ మంత్రి సంజయ్ ఇల్లును ముట్టడించారు. నీట్ పరీక్ష రద్దుపై స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు లాఠీ ఛార్జి జరిపారు. ఈ సంఘటనలో పలువురికి సల్ప గాయాలు అయ్యాయి. అరెస్ట్, ఠాణకు తరలింపు తరలించారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో ఉన్న సమయంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బండి ఇల్లును ముట్టడి కార్యక్రమం చేపట్టడంతో కరీంనగర్ ఉద్రిక్తత నెలకొంది.నీట్ పరీక్ష రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని, ఎన్ టి ఎ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, నీట్ విద్యార్థుల పట్ల ఎన్ డి ఎ ప్రభుత్వ వైఖరినీ,కేంద్ర మంత్రి బండి సంజయ్ నీట్ సమస్య పై మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ అది వారం ఉదయం విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు .

ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ, ఏఐఎస్ ఎఫ్, ఎన్ ఎస్ యూ ఐ, పి. డి ఎస్ యూ, డివై ఎఫ్ ఐ జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో ఆందోళన కు దిగారు. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని, ఎన్ టి ఎ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ విద్యార్థుల పట్ల ఎన్ డి ఎ ప్రభుత్వ వైఖరినీ,కేంద్ర మంత్రి బండి సంజయ్ నీట్ సమస్య పై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. బండి సంజయ్ కార్యాలయం ముట్టడించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు,విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాదోపవాదాలు, తోపులాట లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు లాఠీ చార్జి చేశారు. పలువురికి స్టూడెంట్స్ నేతలకు సల్ప గాయాలు అయ్యాయి. పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు.పోలీస్ స్టేషన్ కు తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement