Monday, September 30, 2024

Karimnagar – గ‌ర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి – మంత్రులు పొన్నం, సీత‌క్క సూచ‌న‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, క‌రీంన‌గ‌ర్ : గ‌ర్భిణులు పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్య‌వంత‌మైన బిడ్డ జ‌న్మిస్తాడ‌ని మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, సీత‌క్క అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు బాలికల ఉన్నత పాఠశాలలో గ్రామ ఆరోగ్య పారిశుధ్య పోషణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. స్టాల్‌లో ఏర్పాటు చేసిన పౌష్టికాహారం రుచి చూశారు.

స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి
ప్ర‌తి ఒక్క‌రూ పౌష్టికాహారం తీసుకోవాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. ముఖ్యంగా గ‌ర్భిణులు స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. గ‌ర్భిణులు పౌష్టికాహారం తీసుకుంటే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటార‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరారు.

- Advertisement -

ఏజెన్సీలో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌
పంచాతీయ రాజ్ శాఖ మంత్రి సీత‌క్క మాట్లాడుతూ ఏజెన్సీలో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంద‌ని అన్నారు. దీన్ని అధిగ‌మించ‌డం కోసం పౌష్టికాహారం తీసుకోవాల‌ని సూచించారు. ఈ కార్యక్రమం లో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమేల సత్పతి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement