Friday, November 22, 2024

TS: అద్భుత పర్యాటక కేంద్రంగా కరీంనగర్ రివర్ ఫ్రంట్… మంత్రి గంగుల

కరీంనగర్ జిల్లాను అభివృద్దితో పాటు అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది ప్రజలకు వినోదాన్ని పంచేలా చేపడుతున్న మానేరు రివర్ ఫ్రంట్ అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా చరిత్రలో నిలువనుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మానేరు రివర్ ఫ్రంట్ వద్ద చేపట్టే నిర్మాణం పనుల పై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా ఐఎన్ఏ స్టూడియో ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… 24 టీయంసీల మానేరు జలశయాన్ని అద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది ప్రపంచస్థాయి పర్యాటకులను ఆకర్షించేలా తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్ పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

అందులో భాగంగా ఉజ్వలా పార్కు నుండి తీగల వంతెన వరకు అభివృద్ది పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. లోయర్ ప్రామినెడ్, అప్పర్ ప్రామినెడ్ పనులు ఆ తరువాత సివిల్ పనులను చేపట్టాలని సూచించారు. పర్యాటకులను ఆకర్షించేలా పెడాస్టల్ బ్రిడ్జి, ఈకో మొబిలి కారిడార్, తెలంగాణ సంస్కృతి, పోరాట యోధులను గురించి వివరించేలా, బతుకమ్మ గార్డెన్ల ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. బి.గోపి, మేయర్ వై.సునీల్ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, టూరిజం ఎస్ఈ సరిత, జిల్లా టూరిజం అధికారి వెంకటేశ్వర్లు, ఎలక్ట్రిసిటీ ఎస్సీ గంగాధర్, కరీంనగర్ ఆర్డిఓ కె.మహేశ్వర్, ఐఎన్ఏ స్టూడియో ప్రతినిధులు హర్ష్ గోయల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement