కరీంనగర్ వాసి జిల్లా కే కాక తెలంగాణతో పాటు దేశానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చి పెట్టాడు. ఎందరో మహామహులు సైతం ఫోర్బ్స్ సీఐవో జాబితాలో స్థానం దక్కించుకోవడం మహా కష్టం. అలాంటిది కరీంనగర్ కు చెందిన రఘు సాగి ఆ ఘనత సాధించి అంతర్జాతీయంగా తాను పుట్టిన బిడ్డకు వన్నె తెచ్చాడు. ప్రస్తుతం రఘు సాగి ఇన్స్పైర్ బ్రాండ్స్ మల్టీ నేషనల్ కంపెనీకి సీఐవోగా పని చేస్తున్నారు. రఘు సాగి తండ్రి డాక్టర్ సంజీవ్ రావు వెటర్నరీ వైద్యుడిగా పనిచేసి అసిస్టెంట్ డైరెక్టర్ గా పదవీ విరమణ పొందారు. రఘు సాగి తన ప్రాథమిక విద్యను వరంగల్ లోని సరస్వతి శిశుమందిర్ లో పూర్తి చేసి, జగిత్యాలలోని గీత విద్యాలయంలో హైస్కూల్ విద్యను పూర్తి చేశారు.
గుంటూరులోని విజ్ఞాన్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని సౌతర్స్ ఎలినియోస్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశారు. 1992 అమెరికా వెళ్ళిన రఘు సాగి అంచెలంచెలుగా ఎదిగి సిఐఓ స్థాయికి ఎదిగారు. మొదట ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాస్మెటిక్ కంపెనీ సెఫోరాలో పనిచేసిన అనంతరం వాల్ మార్ట్ లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంజనీరింగ్ గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఇన్స్పైర్ బ్రాండ్స్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తు ఫోర్బ్స్ సిఐఓ జాబితాలో చోటు పొంది అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. ఇన్స్పైర్ బ్రాండ్స్ రెస్టారెంట్ లలో ఈ ఏడాది 30 బిలియన్ల యూ ఎస్ డి సేల్స్ సాధించడంలో విజయం సాధించారు. ఫోర్బ్స్ సిఐ ఓ జాబితాలో చోటు పొంది అంతర్జాతీయ ఖ్యాతి గడించి సొంత గడ్డకు దేశానికి వన్నె తెచ్చిన రఘు సాగిని అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తున్నారు.