Tuesday, November 26, 2024

Karimnagar – చరిత్రలో మరచిపోలేని రోజు- మంత్రి గంగుల

క‌రీంన‌గ‌ర్ – చరిత్రలో 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 75 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జాతీయ సమైక్యత దిన్9చ్ఛవం పురస్కరించులోని కరీంనగర్ పోలీప్ పరేడు మైదానంలో జాతీయ పథకాన్ని ఆవిష్క‌రించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని ఇటీవలనే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా జరుపుకున్నాం. అన్నారు. ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెల్లుబికేలా 15 రోజులపాటు జరుపుకున్నామని దానికి కొనసాగింపుగానే తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామ‌ని తెలిపారు.. భారతదేశ నిర్మాణంలో తెలంగాణ భాగం పంచుకున్న ఈ రోజును తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా మనం ఘనంగా జరుపుకుంటున్నాం. అన్నారు . తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించింది. ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలిచిపోయాయి. అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement