కరీంనగర్ – బషీర్ బాగ్ లాంటి సంఘటనలు కోరుకుంటున్నారా అంటూ రేవంత్ రెడ్డి పై కరీంనగర్ మేయర్ సునీల్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంధకారం తప్పదని తేలిపోయిందని అన్నారు. కె సి ఆర్ రైతు బంధు అని రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక ముక్షమంత్రి కె సి ఆర్ అన్నారు.
రేవంత్ మాటలపై కాంగ్రెస్ పెద్దలు మౌనంగా అంగీకరిస్తున్నట్టు ఉందన్నారు. ఎన్నికల్లో రేవంత్ కు కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వేలేకరుల సమావేశంలో కార్పొరేటర్ లు నాయకులు పాల్గొన్నారు.