ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ : సింగరేణి బొగ్గు గనులు అమ్ముతే ఊరుకోమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆర్థిక సామాజిక జీవనాడి సింగరేణి ఆరు జిల్లాల్లో విస్తరించి ఉందని అన్నారు. 133 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థను ప్రైవేట్ పరం చేస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఏ ఒక్క బొగ్గు గనిని కూడా ప్రైవేట్ పరం కాకుండా కాపాడారన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ , బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు, గంగుల అశోక్ పాల్గొన్నారు.