కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలు కూడా జలమయం అయ్యాయి. జమ్మికుంట్ల లో 31 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. జమ్మికుంట, వీనవంకలో వరద ఉధృతి కొనసాగుతుంది. కరీంనగరం జగిత్యాల రోడ్ పై వి పార్క్ హోటల్ వద్ద వరద పెరగడంతో ఈ రోడ్డు పై వాహన రాకపోకలను నిలిపి వేసి రేకుర్తి చౌరస్తా నుండి శాతవాహన యూనివర్సిటీ రోడ్డు గుండా తరలిస్తున్నారు.
కరీంనగర్ సమీపంలోని గ్రామాల్లో కూడా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. కొండాపూర్, దుర్శేడు, రేకుర్తి తదితర గ్రామాలన్ని వరద నీటి మయం కావడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. రేకుర్తిలోని మైనార్టీ గురుకులం వద్దకు వచ్చి చేరిన నీటితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు.
ఉదృతంగా ప్రవహిస్తున్న కొత్తపల్లి చెరువు..
కరీంనగర్ నగర సమీపంలోని కొత్తపల్లి చెరువు ఉదృతంగా ప్రవహిస్తున్నది వెలిశాల రోడ్డు వైపు వాహనాలు వెళ్లకుండా రోడ్డుకు ఇరువైపులా బారికెళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. వె లిచాలి ఎక్స్ రోడ్ వద్ద బ్లూ కోర్టు వారు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కొత్త పెళ్లి పట్టణ ప్రజలు ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళవద్దని మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు సూచించారు. గురువారం ఆయన చెరువు పరివాహక కాలనిలలో పర్యటించారు.
ధర్మపురి ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర లో మరియు ఉత్తర తెలంగాణాలో అతిభారీ వర్ష సూచన కారణంగా ఏక్షణం లోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి ,గోదావరి నది లోకి వదిలే అవకాశం వుంది. గోదావరి ప్రవహక ప్రాంతమైన జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎల్లంపల్లి 20 గేట్లు ఎత్తడంతో వెల్గటూర్ మండల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎల్లంపల్లి బాక్ వాటర్ పెరిగి కోటికింగాల పుష్కర ఘాట్ లు నీట మునిగాయి. అధికారులు గోదావరి పరివాహక
గ్రామాలలో దండోరా వేశారు