Monday, November 18, 2024

Karimnagar – చైత‌న్య హాస్ట‌ల్లో ఫుడ్ పాయిజ‌న్… 70 మంది విద్యార్ధుల‌కు అస్వ‌స్థ‌త …

కరీంనగర్ పట్టణంలోని మిషన్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీ చైతన్య రెసిడెన్సి కాలేజీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్ ఆయన ఆహారం తిని కళాశాలలోని 70 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో చైతన్య రెసిడెన్స్ కాలేజీ యాజమాన్యం నుండి విద్యార్థులను అంబులెన్స్ లో దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అయితే వెంటనే విషయాన్ని గుర్తించిన కళాశాల యాజమాన్యం విద్యార్థినులకు సకాలంలో సరైన మాత్రలు ఇవ్వడంతో 20 మంది విద్యార్థులకు హాస్టల్లోనే ఉంచి వైద్యాన్ని అందించారు. ఇక తీవ్రంగా అస్వస్థకు గురైన 20 మంది విద్యార్థినిలను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్లు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement