కరీంనగర్ నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగర హైలాండ్స్ జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా సోమవారం క్యాంపు కార్యాలయంలో మేయర్ సునిల్ రావు, కమిషనర్ సేవా ఇస్లావత్ తో కలిసి ఆర్వీ కన్సెల్టెన్సీ, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీ కాంట్రాక్టర్ తో సమీక్ష నిర్వహించారు. నగరంలో ఉన్న పెండింగ్ హైలాండ్ అభివృద్ది, డిజైన్స్ రూపకల్పన, హైలాండ్స్ వారిగా ల్యాండ్ స్కేపింగ్, వాటర్ పౌటెంన్, గ్రీనరీ, వివిద రకాల సంస్కృతి చిహ్నాల ఏర్పాటుపై అధికారులు, ఎజెన్సీ కాంట్రాక్టర్ తో సుదీర్ఘంగా చర్చించారు. ఎజెన్సి రూపొందించిన హైలాండ్స్ డిజైన్స్ ను పరిశీలించి… వాటి రూపకల్పన పై అధికారులు, ఎజెన్సీ కాంట్రాక్టర్ కు సలహాలు, సూచనలు చేశారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా హైలాండ్స్ సుందరీకరణ పనులు చేయాలని, ఆ తరహాలో డిజైన్స్ రూపొందించి ఫైనల్ చేయాలని మంత్రి ఆదేశించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement