Thursday, September 12, 2024

Karimnagar – దమ్ముంటే ధరణి నీ రద్దు చేయండి – బిఆర్ఎస్ సవాల్

ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ :బిఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కా, మంత్రులు శ్రీదర్ బాబు, పొన్నం ఆరోపణలు దురదృష్ట కరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ పై వెటకారంగా మాట్లాడిన తీరును ఖండించారు. ప్రజల్లో వస్తారట ఏ ముఖం పెట్టుకొని వస్తారు అని మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. కాంగ్రెసోళ్ల పని ఎట్లా ఉన్నదంటే నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉంది అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలు మాట్లాడిండ్రు… 420 హమీలల్లో ఒకే ఒక రుణ మాఫీ చేశాం అన్నారు అదీ పూర్తి స్థాయిలో జరగలేదన్నారు. 22 లక్షల పై చిలుకు రైతులకు రుణ మాఫీ చేసి, గొప్పలు చెప్పుకొంటున్నారు..! ఏ గ్రామంలోనైన మీరు ఇచ్చిన రుణమాఫీ పూర్తి స్థాయి లో జరిగిందా..,? ప్రశ్నించారు. కెసిఆర్ చెప్పినవి, చెప్పనివి ఎన్నో హామీలు నెరవేర్చాలని కొప్పుల ఈశ్వర్ అన్నారు.

తెలంగాణ రాక ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది కదా మీ పాలనలో వ్యవసాయం సాగిందా సాగు నీళ్లు ఉన్నాయా. ఆత్మహత్యలు, ఆకలి చావు, వలసలు లేవా అని ప్రశ్నించారు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ కి జీవనాధారం అని రుజువైందన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలో పిల్లలు పురుగుల అన్నం తింటున్నామని ఏడుస్తున్నారు..!కెసిఆర్ పాలనలో రెసిడెన్షియల్ స్కూల్ ఎలా ఉండే ఇప్పుడు ఉన్నాయి.. ఈ రోజు వరకు గురుకుల పాఠశాలలో 37 మంది విద్యార్థులు మృతి చెందారు..!ఇంకా సిగ్గులేకుండా కెసిఆర్ పై విమర్శలా.. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా…..? అని నిలదీశారు.

వైద్యం మొత్తం పడకేసింది, పెన్షన్, తులం బంగారం, రైతు బరోసా ఏది…? ఆ పైసలే కదా రుణమాఫీ కి ఇచ్చిందన్నారు..! ప్రపంచంలో ఇ న్ని అబద్దాల ఆడినా ముఖ్యమంత్రి గాని, ప్రభుత్వం కాని ఎక్కడ చూడలేదన్నారు..ఉద్యోగ రంగంలో కేటిఆర్ పాత్ర కీలకం 4 లక్షల కోట్ల , పెట్టుబడులు ఈ రాష్ట్రాని వచ్చాయని గుర్తు చేశారు..

ఒక్క నోటిఫికేషన్ ఈ ప్రభుత్యం ఇవ్వలేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఏవి అని ప్రశ్నించారు..కాంగ్రెస్ నాయకులను గ్రామాలలో కొద్ది రోజులలో ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు.. దమ్ముంటే ధరణి నీ రద్దు చేయండి అంటూ బట్టి విక్రమార్క సవాల్ విసిరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement