Tuesday, November 26, 2024

Karepalli – వికటించిన వైద్యం.. ఒకరి మృతి

.
కారేపల్లి (ప్రభ న్యూస్)కారేపల్లి మండల కేంద్రంలోఓ క్వాలిఫైడ్ డాక్టర్ సామినేని రాఘవులు చేసిన ఇంజక్షన్ వికటించి మృతి చెందిన ఘటన బుధవారం మండల కేంద్రంలో జరిగింది. మాణిక్యారం గ్రామానికి చెందిన రేపాకుల లాలయ్య(53) కాలుకు ఎలర్జీ సోకడం కారేపల్లి లోని డాక్టర్ రాఘవులు చికిత్స కోసం వెళ్లారు.. అక్కడ మూడు ఇంజక్షన్ లు చేశారు వైద్యులు .. అయితే ఆ తర్వాత లాలయ్య ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మరో మూడు ఇంజక్షన్ లు చేశారని దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందాడని మృతుని భార్య తెలిపారు.

దీనిపై లాలయ్య భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసిన పోలీసుల డాక్టర్ సామినేని రాఘవులుని కారేపల్లి పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement